వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2023-01-09T00:33:58+05:30 IST

రాష్ట్రంలోని వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేఎం షకీల్‌ షఫి డిమాండ్‌ చేశారు.

వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి

అనంతపురం కల్చరల్‌, జనవరి 8: రాష్ట్రంలోని వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేఎం షకీల్‌ షఫి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వక్ఫ్‌ సంస్థలు, ముతవల్లిలు, మేనేజింగ్‌ కమిటీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షనహాల్‌లో రాయలసీమ జిల్లాల ముతవల్లిల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆ అసోసియేషన అధ్యక్షుడు కేఎం షకీల్‌ షఫి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 7వందల మందికి పైగా ముతవల్లీలు ఉన్నారన్నారు. వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన భూములు కబ్జాకు గురవకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. వక్ఫ్‌ సంస్థలకు చెందిన భవనాలను ఆధునీకరణ చేయడంద్వారా వాటిపై ఆధారపడ్డ ముతవల్లిలతోపాటు ఆ సంస్థలు మరింత అభివృద్ధి చెందే అవకాశముందన్నారు. ఏపీ వక్ఫ్‌బోర్డు సభ్యుడు షఫివుల్లా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పెనుకొండ దర్గా పీఠాధిపతి తాజ్‌బాబా, కదిరి పీఠాధిపతి ఉబేదుల్లా హుస్సేన, కణేకల్లు పీఠాధిపతి మర్షద్‌పీర్‌ సాహెబ్‌, కర్నూలు పీఠాధిపతి మౌలానా హమీద్‌ అలి, దాదాభాయ్‌, చాందిని మస్జిద్‌ ముతవల్లి మునీర్‌, రఫిక్‌, తాజుద్దీన, ప్రభుత్వ ఖాజీలు, మౌలానా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T00:33:59+05:30 IST