Saake Bharati: కూలి పనులు చేసుకుంటూ పీహెచ్‌డీ చేసిన మహిళ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2023-07-31T18:18:55+05:30
సాకే భారతి.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిందామె. కూలి పనులు చేసుకుంటూ.. చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తూ కెమిస్ర్టీలో పీహెచ్‌డీ పట్టా సాధించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పట్టా పొందిన తర్వాత ‘ అక్షర భారతి’ సమాజానికి పరిచయమైంది. ఆమె ధీనగాథ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాక.. అందరి చేత ప్రశంసలు అందుకుంది.
అనంతపురం: సాకే భారతి.. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందిందామె. కూలి పనులు చేసుకుంటూ.. చిన్న రేకుల షెడ్డులో జీవనం సాగిస్తూ కెమిస్ర్టీలో పీహెచ్‌డీ పట్టా సాధించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో పట్టా పొందిన తర్వాత ‘ అక్షర భారతి’ సమాజానికి పరిచయమైంది. ఆమె ధీనగాథ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాక.. అందరి చేత ప్రశంసలు అందుకుంది.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నాగులగుడ్డం గ్రామానికి చెందిన గిరిజన మహిళా ఓ వైపు కూలి పనులు చేసుకుంటూ.. ఇంకోవైపు సంసారాన్ని నెట్టుకొస్తూ.. మరోవైపు రాత్రింబవళ్లు చదువుకుంటూ ఎంతో కష్టపడి పట్టుదలతో పీహెచ్‌డీ పట్టా సాధించింది. అనంతరం ఎస్కే యూనివర్సిటీలో బ్యాక్‌లాగ్ పోస్టులు పడ్డాయి. ఆ పోస్టుల్లో ఒక ఉద్యోగం ఇప్పించాలంటూ వైసీపీ మహిళా ఎమ్మెల్యే పద్మావతి కాళ్లు పట్టుకుంటే కనీసం కనికరం లేకుండా గెంటివేశారంటూ ఓ ఇంటర్వ్యూలో సాకే భారతి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె గాథ ప్రపంచానికి తెలిసిన తర్వాత మానవతావాదులు స్పందించి సహాయసహకారాలు అందించారు. పలు పార్టీల నేతలు ఆమె నివాసానికి వెళ్లి సన్మానించి ఆర్థిక సాయం అందించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Saake Bharati: అక్షర ‘భారతి’కి అన్యాయం
తాజాగా అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి స్పందించారు. సాకే భారతి కుటుంబానికి రెండెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించిన పట్టాను కలెక్టరేట్‌లో సాకే భారతికి కలెక్టర్ అందజేశారు. శింగనమల నియోజకవర్గంలోని సోదనపల్లి గ్రామంలో సాకే భారతికి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
Updated Date - 2023-07-31T18:30:47+05:30 IST