ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: కొత్త వాహనానికి తరచూ రిపేర్లు రావడంతో షోరూమ్ ఎదుటే ఆ యువకుడు...

ABN, First Publish Date - 2023-06-21T15:05:03+05:30

కొత్తగా ఏదైనా వాహనం తీసుకుంటే దాన్ని ఎంతో అపూరూపంగా చూసుకుంటాం. అయితే కొత్త వాహనం తరచూ రిపేర్లు వచ్చి ఇబ్బందులు పెడుతుంటే మాత్రం విసుగెత్తిపోతుంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్యసాయి: కొత్తగా ఏదైనా వాహనం తీసుకుంటే దాన్ని ఎంతో అపూరూపంగా చూసుకుంటాం. అయితే కొత్త వాహనం తరచూ రిపేర్లు వచ్చి ఇబ్బందులు పెడుతుంటే మాత్రం విసుగెత్తిపోతుంటాం. ఇలాంటి చేదు అనుభవమే ఓ యువకుడికి ఎదురైంది. కానీ ఆ యువకుడు చేసిన పని చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. హిందూపురం మండలం బీరేపల్లి గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు మూడు నెలల క్రితం టీవీఎస్ అపాచీ కొనుగోలు చేశాడు. వాహనాన్ని తీసుకున్న కొద్ది రోజుల నుంచే అది రిపేర్‌ అవడం జరుగుతూ ఉండేది. దీంతో విసుగు చెందిన సదరు యువకుడు టీవీఎస్ కంపెనీ షోరూమ్ ఎదుట తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టాడు. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పటి నుంచి తరచూ రిపేర్లు వస్తుండడంతో ఇలాంటి పనికి పాల్పడ్డాడు. మంటల్లో ద్విచక్రవాహనం కాలిబూడిదైంది. వాహనం రిపేర్ అవడంతో షోరూంకు తీసుకువచ్చినప్పటికీ.. షో రూం సిబ్బంది సరిగా రిపేర్ చేయకుండా.... తూతూ మంత్రంగా రిపేర్ చేసి ఇవ్వడం వల్లే.... బైక్ మళ్ళీ మళ్ళీ రిపేర్‌కు గురవుతోందని వాహనదారుడు ఆరోపిస్తున్నాడు. అయితే షో రూం నిర్వాహకులు మాత్రం మరో విధంగా చెప్పుకొచ్చారు. వాహనాన్ని రఫ్‌గా ఉపయోగించడం వల్లే వాహనం తరచూ రిపేరింగ్‌కు వచ్చిందని షోరూం నిర్వాహకులు చెబుతున్నారు.

Updated Date - 2023-06-21T15:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising