ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Payyavula Keshav: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలంటూ పయ్యావుల ఆందోళన

ABN, Publish Date - Dec 19 , 2023 | 12:13 PM

Andhrapradesh: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు.

అనంతపురం: జీబీసీకి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Uravakonda MLA Payyavula Keshav) ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులతో కలిసి బైఠాయించిన పయ్యావుల నిరసన చేపట్టారు. జీబీసీ కాలువ కింద రైతులు వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. సాగునీటిని విడుదల చేయకపోవడంతో మిర్చి పంటలు ఎండిపోతున్న పరిస్థితి. మిర్చి పంట ఎండిపోతుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీబీసీకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హంద్రీనీవా కాలువ వద్ద పయ్యావుల కేశవ్ బైఠాయించిన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ... రెండు రోజుల్లో పరిష్కారం చూపాలని... లేకపోతే సమస్యను తమకు విడిచిపెట్టాలన్నారు. ఏ ఒక్క రైతు మిరపపంట ఎండిపోకుండా కాపాడుకుంటామన్నారు. ‘‘సమస్యకు పరిష్కారం చూపండి..లేకపోతే కాలువలో దూకి మేమే సమస్య ను పరిష్కరిస్తాము. నన్ను బూతులు తిట్టిన పర్వాలేదు... రైతులు సాగుచేసిన పంట ఎండిపోకుండా కాపాడండి’’ అంటూ పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.

Updated Date - Dec 19 , 2023 | 12:13 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising