Big Breaking : చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు వచ్చిందో లేదో.. సీఐడీ మరో పిటిషన్
ABN, First Publish Date - 2023-10-09T14:01:22+05:30
మరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కేసులో కొత్తగా మరో నలుగురిని అధికారులు నిందితులుగా చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చడం జరిగింది.
అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కేసులో కొత్తగా మరో నలుగురిని అధికారులు నిందితులుగా చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చడం జరిగింది. వారిపై ఐపీసీ 120బి, 409, 420, 34,35 37, 166, 167 రెడ్ విత్ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.
ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేశారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు విచారణకు హాజరుకానున్నారు. కాగా.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. అటు హైకోర్టు తీర్పును వెలువరించిందో లేదో.. ఇటు సీఐడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరికొందరి పేర్లను యాడ్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
Updated Date - 2023-10-09T14:25:02+05:30 IST