కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijay Babu : ఆ లేఖతో నాకు సంబంధం లేదు.. నిరూపిస్తే రాజీనామా చేస్తా!

ABN, First Publish Date - 2023-08-28T18:42:02+05:30

‘గిడుగు పురస్కారానికి ఆహ్వానం’ అంటూ అధికార బాషా సంఘం ఛైర్మన్ విజయ్ బాబు (Vijay Babu) సంతకమున్న లేఖ ఒకటి గత వారం రోజులుగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ లేఖలో ప్రతి లైన్‌కు ఒక తప్పు ఉంది.

Vijay Babu : ఆ లేఖతో నాకు సంబంధం లేదు.. నిరూపిస్తే రాజీనామా చేస్తా!

అమరావతి : ‘గిడుగు పురస్కారానికి ఆహ్వానం’ అంటూ అధికార బాషా సంఘం ఛైర్మన్ విజయ్ బాబు (Vijay Babu) సంతకమున్న లేఖ ఒకటి గత వారం రోజులుగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ లేఖలో ప్రతి లైన్‌కు ఒక తప్పు ఉంది. అది కూడా తెలుగులో ఉన్నప్పటికీ.. భాషా సంఘం ఛైర్మన్‌కు తెలుగు రాదా..? ఇదేం లేఖ బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ వ్యవహారంపై బెజవాడలో జరిగిన తెలుగు భాషా వారోత్సవాల్లో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చుకున్నారు.


Vijay-Babu-1.jpg

నిరూపిస్తే రాజీనామా..?

గిడుగు రామ్మూర్తి జయంతి (Gidugu Ramamurthy Jayanthi) సందర్భంగా తెలుగు భాషా వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్ కూడా తొలిసారిగా భాషా వారోత్సవాల్లో పాల్గొనడం సంతోషించదగ్గ విషయమని విజయ్ బాబు చెప్పుకొచ్చారు. ఉద్యోగుల్లో తెలుగు భాషలో సృజనాత్మకత ప్రదర్శించిన వారికి ప్రొత్సహాకాలు ఉంటాయని తెలిపారు. ‘మేం భాషా వారోత్సవాలతో ఓ యజ్ఞం చేస్తున్నాం. ఈ యజ్ఞాన్ని భంగం కలిగించేందుకు కొన్ని తీతువు పిట్టలు ఆటంకం సృష్టించే ప్రయత్నం చేశాయి. పురస్కారాల ఎంపిక కోసం పంపుతోన్న లేఖలు పంపే క్రమంలో మానవ తప్పిదం వల్ల కొంత అక్షర దోషాలు జరిగాయి. దాన్ని మళ్లీ సరి చేసి పంపాం. అయినా దీనిపై కొన్ని తీతువు పిట్టలు కావాలనే విమర్శలు చేస్తూ కూతలు కూస్తున్నాయి. ఆ లేఖపై నేను సంతకం చేయలేదు. నేనే సంతకం చేశానని నిరూపిస్తే రాజీనామాకు సిద్దంగా ఉన్నాను. సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) ప్రాపకం కోసం కాదు.. జగన్ ప్రాభవం కోసం పని చేస్తున్నాను. తెలుగు గురించి మీరెవర్రా మాట్లాడడానికి..? (విమర్శకులను ఉద్దేశించి). వైఎస్ జగన్ మాట్లాడే వాటిల్లో కొంత తడబాటు వల్ల వచ్చే పొరపాట్లు ఉన్నాయి. కానీ నారా లోకేష్‌కు (Nara Lokesh) వర్ధంతి, జయంతికి తేడా తెలీదు.. ప్రశాంతత అనలేక ప్రశాంతత్త అని పలుకుతారు’ అని విజయ్ బాబు విమర్శలు గుప్పించారు. అయితే ఇందులో వైఎస్ జగన్, నారా లోకేష్ ప్రస్తావన ఎందుకొచ్చిందో విజయ్ బాబుకే తెలియాలి.

నెట్టింట్లో వైరల్ అయిన లేఖ ఇదే..

Updated Date - 2023-08-28T18:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising