ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: బీజేపీ గాంధీ ఆలోచనలను కొనసాగిస్తోంది

ABN, First Publish Date - 2023-10-02T14:35:19+05:30

గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సోమువీర్రాజు పుష్పాంజలి ఘటించారు.

విజయవాడ: గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) , సోమువీర్రాజు పుష్పాంజలి ఘటించారు. అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ.. ఇద్దరు మహాత్ములు ఈరోజు జన్మించారని.. మహాత్ముని ఆశాయాలు కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళి అని అన్నారు. ఈ రోజన జాతీయవాదం అనే పదానికి అర్థం లేకుండా ఉందన్నారు. ప్రాంతీయవాదంతో జాతీయ భావన లేకుండా పోతోందని పలువురు భావిస్తున్నారని తెలిపారు. అసహనం ద్వారా హింస పెరిగిపోతుందన్నారు. దేశవ్యాప్తంగా అని చెప్పను కానీ మన రాష్ట్రంలో అసహనంతో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని తెలిపారు. గ్రామాలపట్ల మన రాష్ట్రంలో చిన్నచూపు చూస్తున్నారని... గ్రామాభివృద్ధి లేదని.. రోడ్లు, మౌళిక వసతులు లేవని అన్నారు. నాణ్యత లేని మద్యాన్ని అమ్ముతూ డబ్బు దండుకొనేందుకు జేబులు నింపుకొనే ఆలోచన ఏపీ చూస్తున్నామన్నారు. బీజేపీ గాంధీ ఆలోచనలను కొనసాగిస్తోందన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్యపాన నిషేధం అంశం మ్యానిఫెస్టోలో పెట్టడంపై చర్చించుకొని ప్రకటిస్తామని అన్నారు. నంరేంద్ర మోదీ పుట్టిన రోజు నుంచి గాంధీ జయంతి వరకు సేవ చేయాలని బీజేపీ పిలుపునిచ్చిందని ఏపీ బీజేపీ చీఫ్ పేర్కొన్నారు.


లాల్ బహదూర్ శాస్త్రి గట్టి సంకల్పంతో అంచలంచలుగా ఎదిగారన్నారు. రైలు ప్రమాదానికి గురైతే లాల్ బహదుర్ శాస్త్రి రాజీనామా చేశారని.. ఈనాడు అలాంటి మంత్రులను చూడగలమా? అని అన్నారు. జై జవాన్, జై కిసాన్ నినాదంతో రైతులకు పెద్దపీట వేసిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పుకొచ్చారు. ఆయన లాగే బీజేపీ వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు చేసిందన్నారు. రైతు తన ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకొనేందుకు చట్టం చేసిందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.


సోము వీర్రాజు మాట్లాడుతూ.. గాంధీ మహాత్ముని ఆశయం ప్రకారం బీజేపీ నడుస్తోందన్నారు. ఆయన ఆశయాల ప్రకారం ఖాదీని మనం ప్రోత్సహించాలని తెలిపారు. బ్రాందీమీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రోజు కోటిమంది త్రాగుతున్నారన్నారు. చీప్ లిక్కర్ తయారీకి పాతిక రూపాయలు ఖర్చు అవుతుంది. రేటు తగ్గించి అమ్ముతామని తాను అంటే ట్రోల్ చేశారన్నారు. గుజరాత్ బీజేపీలో సంపూర్ణ మధ్యపాన నిషేధం పెట్టారని పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T14:39:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising