ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: సీఎం జగన్‌పై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 19 , 2023 | 12:51 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారన్నారు.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌పై (CM Jagan) బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (AP BJP Chief Purandeshwari) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారన్నారు. పేదలకు ఇళ్ల ఇవ్వకుండా ప్రజలను జగన్ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. టిడ్కో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఏయూ వైసీపీ కార్యాలయంగా మార్చేశారన్నారు. అన్ని పథకాలకు జగన్ బొమ్మలు వేస్తున్నారని.. జగన్ ప్రభుత్వాన్ని స్టిక్కర్ ప్రభుత్వంగా పిలుస్తామని ఎద్దేవా చేశారు. రుషికొండలో పర్యావరణ ఉల్లంఘన జరిగిందని.. ఈ కొండను బొడి గుండు కొట్టేశారన్నారు. కోడి గుడ్డుల మీద కూడా ఆఖరికి జగన్ బొమ్మలు వేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు భారీగా నమోదు చేస్తున్నారన్నారు. రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్నారు.


మెట్రో రైల్‌కు డీపీఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈఎస్‌సీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే భూమి ఇచ్చారన్నారు. విశాఖలో అనేక ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టారని.. భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు అప్పనంగా భూములు కట్టబెట్టారన్నారు.ర రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పూర్తిగా దిగజార్చారని... అనేక ఐటీ పరిశ్రమలు విశాఖ వదిలి వెళ్ళిపోయాయన్నారు. యువతలో డ్రగ్ కల్చర్ పెరిగిపోతుండటం బాధాకరమన్నారు. విశాఖ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని.. ఎన్నో కేంద్ర సంస్థలు విశాఖకు రావడం అంతా బీజేపీ చలువే అని చెప్పుకొచ్చారు. మోదీ దూర దృష్టి కారణంగానే భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పురందేశ్వరి పేర్కొన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising