Skill Development Case : చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, అచ్చెంనాయుడు పేర్లు
ABN, First Publish Date - 2023-09-10T10:34:50+05:30
నారా చంద్రబాబు నాయుడును శనివారం అరెస్టు చేసిన సీఐడీ విజయవాడలోని కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కే అచ్చెంనాయుడు పేర్లను కూడా పేర్కొంది.
అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిందితుల జాబితాకు అంతం లేకుండా పోతోంది. టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం అరెస్టు చేసిన సీఐడీ విజయవాడలోని కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నారా లోకేశ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కే అచ్చెంనాయుడు పేర్లను కూడా పేర్కొంది.
చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేశ్ ద్వారా లోకేశ్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఆరోపించింది. రిమాండ్‌ను తిరస్కరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదిస్తుండగా, ఆయనను 15 రోజులపాటు కస్టడీకి అనుమతించాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇరు పక్షాల వాదోపవాదాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో అచ్చెంనాయుడు మాట్లాడుతూ, జగన్‌రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. చంద్రబాబును ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. జగన్ పాలనంతా రాజకీయ కక్ష సాధింపులేనని చెప్పారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి ఆనందపడుతున్నారన్నారు. రాజకీయ కక్షతో ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కక్షసాధింపు చర్యల కోసం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
ఇవి కూడా చదవండి :
CBN Arrest Case : ఏసీబీ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. ఏం చెప్పారంటే..?
Updated Date - 2023-09-10T10:34:50+05:30 IST