ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Highcourt: జగన్ సర్కార్‌కు హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2023-05-11T14:33:51+05:30

జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్ ప్రభుత్వానికి (Jagan Government) ఏపీ హైకోర్టులో (AP Highcourt) మరో ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది జూన్‌లో మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇచ్చిన జీవోపై న్యాయస్థానం స్టే విధించింది. మున్సిపల్ స్కూళ్ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పురపాలక టీచర్స్ ఫెడరేషన్ (ఎంటిఎఫ్) అధ్యక్షులు ఎస్ రామకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2115 మున్సిపల్ స్కూళ్లు ఉండగా.. వీటి విలీనంపై ధర్మాసం స్టే ఇచ్చింది. పురపాలక చట్టాలకు, 74 అధికరణానికి వ్యతిరేకంగా జీవో 84 ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. జీవో 180 ద్వారా పురపాలక పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పెత్తనానికి అవకాశం కల్పించడం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. జీవో 184 ప్రకారం విద్యాశాఖ నుంచి పురపాలక పాఠశాలల ఉపాధ్యాయుల జీతభత్యాలు చెల్లింపు చేయకూడదనే అశంపైనా పిటీషనర్‌తో ఏకీభవించిన హైకోర్టు మున్సిపల్ పాఠశాలలను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తూ ఇచ్చిన జీవోపై స్టే ఇచ్చింది.

మున్సిపల్ పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోపై గతంలో ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. కోటి 30 లక్షల మంది పట్టణ జనాభాలో 5 లక్షల మంది పిల్లలు మున్సిపల్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వారిలో 95శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు ఉన్నారు. మున్సిపల్ స్కూళ్ళ ఆస్తుల కోసమే విలీనం అంటూ అప్పట్లో ఉపాధ్యాయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ జగన్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తూ జీవో 84 ఇచ్చి విలీనం చేసింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి నారాయణ మున్సిపల్ స్కూళ్లు అన్నింటిని ఇంగ్లీష్ మీడియంగా మారుస్తూ నిర్ణయిం తీసుకున్నారు. నాటి నుంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చి విద్యార్ధులు ప్రైవేటు స్కూళ్ల వైపు చూసేలా జగన్ సర్కార్ వ్యవహరించింది.

Updated Date - 2023-05-11T14:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising