AP Ministaer: ఇసుక రీచ్‌ల వద్ద టీడీపీ నేతల ఆందోళనపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే?..
ABN, First Publish Date - 2023-08-31T15:28:11+05:30
అన్ని అనుమతులు ఉన్న ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లి టీడీపీ నేతలు ఆందోళన చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: అన్ని అనుమతులు ఉన్న ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లి టీడీపీ నేతలు (TDP Leaders) ఆందోళన చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddyd Ramachandrareddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇసుకను దొంగతనం చేసింది టీడీపీ ప్రభుత్వమే (TDP Government) అని.. ఉచిత ఇసుక అని చెప్పి దోపిడీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఇంటి వెనుకే ఇసుక దోపిడీ జరిగినా ముఖ్యమంత్రిగా అయన పట్టించుకోలేదన్నారు. ముందు డ్వాక్రా మహిళల పేరు చెప్పి ఇసుక దోచుకుంది కూడా చంద్రబాబే అని అన్నారు. కృష్ణ ,గోదావరి, పెన్నా వంశధార అన్ని నదుల్లోనూ ఇసుక దోపిడీ జరిగిందన్నారు. టీడీపీ హయాంలో ప్రతీ నెలా లోకేశ్‌కు (Nara lokesh) రూ.500 కోట్లు ముడుపులు వెళ్లేవని ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. వైసీపీ అధికారంఃలోకి వచ్చాక 70, 71 జీవోల ద్వారా ఇసుక విధానం తెచ్చామన్నారు. పారదర్శకంగా జేపీ వెంచర్స్ సంస్థకు ఇసుక తవ్వకాలను ఇచ్చామన్నారు. ఏటా రూ.765 కోట్లు ఇసుక టెండర్‌ల ద్వారా ఆదాయం వస్తోందని.. మరి చంద్రబాబు హయాంలో ఈ ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్ళిందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాల వారీగా ఇసుక ధరలు ప్రకటిస్తూనే ఉన్నామన్నారు. ఒక్క జేపీ సంస్థ ద్వారా మాత్రమే రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్‌లు జరుగుతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
Updated Date - 2023-08-31T15:28:11+05:30 IST