AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో అనుమానితుల హల్‌చల్
ABN, First Publish Date - 2023-03-17T21:06:37+05:30
చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో (MLC Elections Counting) అనుమానితుల హల్‌చల్ చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి కౌంటింగ్ కేంద్రంలో తిరుగుతున్నారని అధికారులు గుర్తించారు.
తిరుపతి: చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో (MLC Elections Counting) అనుమానితుల హల్‌చల్ చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి కౌంటింగ్ కేంద్రంలో తిరుగుతున్నారని అధికారులు గుర్తించారు. చిత్తూరు కలెక్టర్ హరి నారాయణ చెప్పేవరకు అనుమానితుడిని పోలీసులు పసిగట్టలేదని అధికారులు మండిపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అనుమానితుడిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
కడప-అనంతపురం-కర్నూలు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. 7వ రౌండ్ పూర్తయ్యేసరికి 1,68,023 ఓట్ల లెక్కింపు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చెల్లిన ఓట్లు 1,54,931.. చెల్లని ఓట్లు 13,092 వచ్చాయని, టీడీపీకి 63,754.. వైసీపీకి 65,136, పీడీఎఫ్‌కి 5,278 ఓట్లు వచ్చాయి. 7వ రౌండ్‌లో టీడీపీ (TDP) ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి 637 ఓట్ల మెజార్టీ సాధించారు. టీడీపీ 9,663.. వైసీపీ (YCP) 9,026, పీడీఎఫ్ 1683 సాధించింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో టీడీపీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ పతనం ప్రారంభమైందని, పులివెందులలోనే టీడీపీ మెజార్టీ వచ్చిందని తంగిరాల సౌమ్య అన్నారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల (West Rayalaseema Graduate) కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసులు (Police) హైఅలర్ట్ ప్రకటించారు. వైసీపీ (YCP) మూకలు దాడులకు పాల్పడతాయన్న అనుమానంతో కౌంటింగ్ కేంద్రం దగ్గర భద్రత పెంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ప్రతి రౌండ్ కౌంటింగ్లో టీడీపీ (TDP) ఆధిక్యత కనబరుస్తోంది. ఓటమి భయంతో కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు వైసీపీ నేతలు పన్నాగం పన్నుతున్నారు. నిఘా వర్గాల సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు జేఎన్టీయూ కేంద్రం దగ్గర హైఅలెర్ట్ ప్రకటించి భారీగా భద్రత పెంచారు.
ఏపీ (Andhrapradesh)లో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది.
Updated Date - 2023-03-17T21:09:47+05:30 IST