ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLC Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో TDP నేతల సంబరాలు

ABN, First Publish Date - 2023-03-17T20:41:40+05:30

నందిగామలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎన్టీఆర్: నందిగామలో టీడీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో టీడీపీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ పతనం ప్రారంభమైందని, పులివెందులలోనే టీడీపీ మెజార్టీ వచ్చిందని తంగిరాల సౌమ్య అన్నారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల (West Rayalaseema Graduate) కౌంటింగ్ కేంద్రం దగ్గర పోలీసులు (Police) హైఅలర్ట్ ప్రకటించారు. వైసీపీ (YCP) మూకలు దాడులకు పాల్పడతాయన్న అనుమానంతో కౌంటింగ్ కేంద్రం దగ్గర భద్రత పెంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ప్రతి రౌండ్ కౌంటింగ్లో టీడీపీ (TDP) ఆధిక్యత కనబరుస్తోంది. ఓటమి భయంతో కౌంటింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు వైసీపీ నేతలు పన్నాగం పన్నుతున్నారు. నిఘా వర్గాల సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు జేఎన్టీయూ కేంద్రం దగ్గర హైఅలెర్ట్ ప్రకటించి భారీగా భద్రత పెంచారు.

ఏపీ (Andhrapradesh)లో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పట్టభద్రుల స్థానాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ తొలి ప్రాధాన్యత కౌంటింగ్ ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ (TDP candidate Srikanth) ముందంజలో ఉన్నారు. మొత్తం ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కించారు. శ్రీకాంత్‌కు 25,731 ఓట్ల మెజార్టీ సాధించారు. టీడీపీకి 1,06,587, వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి (Shyamprasad Reddy)కి 80,856 ఓట్లు పోలయ్యాయి. ఎవరికీ పూర్తి మెజార్జీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కిస్తున్నారు. మొత్తం 2.70లక్షల ఓట్లు పోలయ్యాయి. ఒక్కోరౌండ్‌కు 40వేల ఓట్లను లెక్కించారు. అందులో ప్రతీరౌండ్‌లోనూ దాదాపు మూడువేల చెల్లని ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత లెక్కింపులో 51 శాతం ఆదిక్యత తప్పనిసరి. టీడీపీ, వైసీపీ (TDP YCP) అభ్యర్థులిద్దరూ 51 శాతం మెజారిటీ సాధించలేకపోయారు. దీంతో ఫలితం ఎవరికీ తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

టీడీపీ(TDP) పోటీ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ Graduate MLC Election Counting) ప్రక్రియపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనల అమలు, అక్రమాల నివారణపై జిల్లా అధికారులకు, ఎన్నికల అధికారులకు చంద్రబాబు (TDP Chief) ఫోన్ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్‌కే మీనా (The Chief Electoral Officer of the state is MK Meena), అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ (Anantapur District Collector Nagalakshmi), ఎస్పీ ఫకీరప్ప (SP Fakirappa) లతో టీడీపీ అధినేత ఫోన్‌లో మాట్లాడారు. అనంతపురం కౌంటింగ్ సెంటర్‌లోకి ఎటువంటి పాసులు లేకుండా చొరబడి... టీడీపీ వారిపై దాడులకు దిగిన వైసీపీ (YCP) శ్రేణులపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-03-17T20:43:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising