AP News: ‘సీమ ఎడారిగా మారక తప్పదు’
ABN, First Publish Date - 2023-02-11T16:59:21+05:30
ఎగువ భద్ర ప్రాజెక్ట్తో సీమ ఎడారిగా మారక తప్పదని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) అన్నారు.
అమరావతి: ఎగువ భద్ర ప్రాజెక్ట్తో సీమ ఎడారిగా మారక తప్పదని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) అన్నారు. సీమలోని తుంగభద్ర హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, కేసీ కెనాల్ ప్రాజెక్టులు నీరు లేక నిరుపయోగం అవుతాయన్నారు. సీమలోని 8 లక్షల ఎకరాల సాగుభూమి బీడవుతుందని మండిపడ్డారు. నికర జలాల కేటాయింపు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్ట్ను నిర్మిస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు. ఎగువ భద్ర ప్రాజెక్ట్ను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2023-24 బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించిందన్నారు. ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం మిన్నకుండిపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అప్పర్ భద్ర ప్రాజెక్టు పనులను నిలువరించాలని ఆయన సూచించారు.
Updated Date - 2023-02-11T16:59:23+05:30 IST