ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodali Nani: మూడు రాజధానులపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-01T19:40:25+05:30

జగన్ ప్రభుత్వం 3 రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) స్పష్టం చేశారు.

అమరావతి: జగన్ ప్రభుత్వం 3 రాజధానులకే కట్టుబడి ఉందని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) స్పష్టం చేశారు. జగన్ (CM Jagan) ఢిల్లీలో కొత్తగా ఏమీ చెప్పలేదని.. ఎప్పుడూ చెప్పేదే చెప్పారని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా తమకు రాజధానిపై శాసనాధికారం లేదంటే.. కేంద్రం ప్రభుత్వంతో బిల్లుపెట్టిస్తామన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ మద్దతు కావాలంటే ఆ పార్టీలు 3 రాజధానులకు కేంద్రంలో అంగీకారం తెలపాల్సిందేనని కొడాలి నాని స్పష్టం చేశారు.

కాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఏపీ రాజధానిగా విశాఖ అవుతుందని చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు తెలిపారు. మార్చి నెలలో విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని జగన్ పిలుపునిచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ఇన్వెస్టర్లకు జగన్ వివరించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా ఉంటోందని వెల్లడించారు.

Updated Date - 2023-02-01T19:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising