ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: పాదయాత్రలో వాలంటీర్ల అరెస్ట్ అప్రజాస్వామికం

ABN, First Publish Date - 2023-09-06T09:32:59+05:30

బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి చేసి వాలంటీర్లను అరెస్ట్ చేయడంపై ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి చేసి వాలంటీర్లను అరెస్ట్ చేయడంపై ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 205 రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు (YuvaGalam Padayatra) రక్షణగా నిలుస్తున్న వాలంటీర్ల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. యువగళం శ్రేణులపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) సైకో తర్వానికి అద్దం పడుతోందని వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న విషేశ స్పందనను చూసి అక్రమ కేసులతో ఆటంకాలు సృష్టించడం వైసీపీ దిగజార్చుడుతనానికి నిదర్శనమన్నారు. లండన్‍ పర్యటనలో ఉన్నప్పటికీ జగన్ రెడ్డికి యువగళమే గుర్తుస్తోందన్నారు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ నేతలకు సహకరిస్తూ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలా మారారని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కల్పిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామని తెలిపారు. రాజ్యహింసను ప్రేరేపిస్తూ అమాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజల కోసం పని చేసే టీడీపీ శ్రేణులపై జగన్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు స్వస్తి పలికే రోజు త్వరలోనే ఉందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-09-06T09:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising