Atchannaidu: రూ.3,300కోట్లు అవినీతి అని.. చివరకు పార్టీ ఫండ్‌ను కూడా వదట్లేదు..
ABN, First Publish Date - 2023-10-06T13:26:41+05:30
పార్టీ జాతీయ కార్యాలయంలో ‘‘స్కిల్‌పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడి చేయడమే’’ అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు శుక్రవారం ఆవిష్కరించారు.
అమరావతి: పార్టీ జాతీయ కార్యాలయంలో ‘‘స్కిల్‌పై నిందలు వేయడమంటే, యువత భవితపై దాడి చేయడమే’’ అనే పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu), టీడీపీ నేతలు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించిన పూర్తి వాస్తవాల ప్రతిరూపమే ఈ పుస్తకమన్నారు. త్వరలోనే ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారాలను కూడా పూర్తి వాస్తవాలతో పుస్తక రూపంలో ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. రూ.3,300 కోట్ల అవినీతి అని విషప్రచారం చేసి, చివరకు రూ.27కోట్ల పార్టీ ఫండ్‌ను అవినీతి సొమ్ముగా భూతద్దంలో చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాల్ని అవినీతి సొమ్ముగా చూపడం ఈ ముఖ్యమంత్రి, అతని మోచేతి నీళ్లుతాగే వ్యవస్థల మతిలేనితనానికి నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రజలు, కార్యకర్తలు ఇచ్చిన నిధులకు.. జగన్ సర్కార్ చెబుతున్న అవినీతికి సంబంధమేంటని ప్రశ్నించారు. అసలు అవినీతి సొమ్ము అంటే జగన్ రెడ్డి ఖాతాలకో.. అతని కంపెనీలకో.. అతని భార్య ఖాతాకో వచ్చినట్టు వచ్చే సొమ్ము అని అన్నారు. చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపి 28 రోజులవుతున్నా.. ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు బయటపెట్టలేక చివరకు పార్టీకి వచ్చిన నిధులపై పడిందని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు పిచ్చివాగుడు వాగుతున్నారు తప్ప వాస్తవాలు తెలుసుకోవడంలేదని అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.
Updated Date - 2023-10-06T13:26:41+05:30 IST