ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ హేట్స్ జగన్

ABN, First Publish Date - 2023-10-10T12:52:17+05:30

బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా? అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా? అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై (Former Minister Kalva Srinivasulu) వరుస కేసులు బనాయించిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి
(CM Jagan) అంటూ మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ జగన్మోహన్ రెడ్డి పెత్తందారితనం మరొకసారి రుజువు చేసుకున్నారన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు పెట్టడం హేయమన్నారు. అన్ని కేసుల్లోనూ కాలవనే మొదటి ముద్దాయిగా పోలీసులు చేర్చారన్నారు. శాంతియుత నిరసనలపై పోలీసులు కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులెందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా వెంటనే ముందస్తు అరెస్ట్‌లు ఇవ్వడం పోలీసులకు పరిపాటిగా మారిందని అన్నారు. చట్టాన్ని జగన్ రెడ్డి చుట్టంలా వాడుకుంటూ కొంత మంది పోలీసులను వైసీపీ ప్రైవేటు సైన్యంలా మార్చుకొని అరాచకానికి నాంది పలుకుతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ప్రతిపక్ష నాయకులకు మాట్లాడే స్వేచ్ఛ లేదన్నారు. ఆఖరికి బీసీలు గాలి పీల్చాలన్నా జగన్ రెడ్డి పర్మిషన్ కావాలంటారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఇంతటి నిరంకుశత్వ పాలనకు చరమ గీతం పాడే తరుణం ఆసన్నమైందన్నారు. జగన్ రెడ్డి అరాచకాన్ని బడుగు బలహీన వర్గాలు భరించలేకపోతున్నారని తెలిపారు. ఏపీ నీడ్స్ జగన్ కాదు ఏపీ హేట్స్ జగన్ అని ప్రజలు పిలుపునిస్తున్నారన్నారు. జగన్ రెడ్డికి జనానికి జరగబోవు ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీ పాలన అంతం ప్రజల పంతంగా సాగనుందన్నారు. ఈ ఐదేళ్లు రాష్ట్రంలో ఒక చీకటి అధ్యాయంలా ముగిసిపోనుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-10T12:52:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising