ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP TDP Chief: మళ్లీ మోసం చేసేందుకే బస్సు యాత్ర.. మంత్రులపై అచ్చెన్న ఆగ్రహం

ABN, First Publish Date - 2023-10-26T13:03:31+05:30

బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ మోసం చేస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను జగన్ (AP CM Jagan) మోసం చేస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) వ్యాఖ్యలు చేశారు. గురువారం పేదల గొంతు కొస్తున్న పెత్తందారు జగన్ రెడ్డి పేరుతో టీడీపీ బ్రౌచర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ.. పెత్తందారు జగన్ పేదల గొంతు కోస్తూ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలన జగన్ ఇబ్బంది పెట్టారన్నారు. బడుగుల అభివృద్ధిపై ఇన్నాళ్లూ గాఢ నిద్రలో ఉండి.. మళ్లీ మోసం చేసేందుకు బస్సు యాత్ర అంటున్నారన్నారు. బడుగులను జగన్ ఊచ కోత కోశారని.. బడుగుల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాశారని విమర్శలు గుప్పించారు. దారి మళ్లించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల గురించి సమాధానం చెప్పి వైసీపీ బస్ యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. నిధుల్లేని.. ఆర్థిక సాయం అందించలేని కార్పోషన్లను ఏర్పాటు చేసి బీసీ కులాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పుట్టినప్పట్నుంచి.. చనిపోయేంత వరకు బడుగుల కోసం చంద్రబాబు ఎన్నో పథకాలు పెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు పెట్టిన పథకాలని జగన్ రద్దు చేశారన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లల్లో జగన్ ప్రభుత్వం బీసీ కోటాను తగ్గించేశారన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతోంటే నోరు తెరిచి మాట్లాడలేని బీసీలకు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. ఈ మంత్రుల వల్ల బడుగు వర్గాలకు ఏం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. రెడ్డి వర్గానికి చెందిన నలుగురిని జగన్ సామంత రాజులుగా చేసుకున్నారన్నారుు. రాజ్యం రెడ్ల చేతుల్లో పెట్టారన్నారుు. పవర్ లేని పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇస్తే లాభమేముందని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని హితవుపలికారు. ఇంకెన్నాళ్లు రెడ్డిగారికి పనిచేయాలని బడుగు వర్గాలకు చెందిన మంత్రులు ఆలోచించుకోవాలన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే మంత్రులు బస్ యాత్ర ప్రారంభించాలని అచ్చెన్నాయడు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-26T13:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising