ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Atchannaidu: ఎన్‌‌ఆర్‌ఐ యష్ అరెస్ట్ అప్రజాస్వామికం..

ABN, Publish Date - Dec 23 , 2023 | 09:34 AM

Andhrapradesh: ఎన్ఆర్ఐ యశస్వి (యష్) పొద్దులూరి అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులని.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలకు వేధింపులని మండిపడ్డారు.

అమరావతి: ఎన్ఆర్ఐ యశస్వి (యష్) పొద్దులూరి అరెస్ట్ అప్రజాస్వామికమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులని.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలకు వేధింపులని మండిపడ్డారు. ఎన్ఆర్ఐలు అంటే జగన్ రెడ్డికి (CM Jaganmohan Reddy) గిట్టదని మరోసారి బట్టబయలైందన్నారు. అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్ర జరుగుతోందన్నారు. ఓటమి భయంతోనే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యులైన యష్‌ను అరెస్టు చేయడం సైకోయిజానికి నిదర్శనమన్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని యష్ పరామర్శించడం నేరమా అని ప్రశ్నించారు. యష్ భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు జగన్ మోహన్ రెడ్డి తీరును ఖండించాలని అచ్చెన్నాయుడు కోరారు.

Updated Date - Dec 23 , 2023 | 11:42 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising