ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics : వలంటీర్ వ్యవస్థపై అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-07-17T22:21:28+05:30

సోమవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు జీతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన వలంటీర్ వ్యవస్థకు (Volunteer System) టీడీపీ (TDP) వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) స్పష్టం చేశారు. సోమవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు జీతం వైసీపీ (YSRCP) పార్టీ ఇవ్వటం లేదని ప్రజాధనం ద్వారా జీతాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వారధిగా ఉండాలని.. జగన్‌, వైసీపీకి వాలంటీర్లు ఊడిగం చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘వ్యక్తిగత డేటా అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు?. సంక్షేమ పథకాల కోసం అనగానే వేలిముద్ర వేస్తే.. రేపు జగన్‌రెడ్డి (Jagan Reddy) మీ ఆస్తులు లాక్కుంటారు. ఏపీని రావణకాష్టంగా మార్చాలని జగన్‌రెడ్డి చూస్తున్నారు. ప్రజలు మేలుకోకపోతే రాష్ట్రం వల్లకాడు అవుతుంది’ అని అచ్చెన్న విమర్శించారు.


చంద్రబాబు ఇలా..!

కాగా.. వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌తో ఏపీలో రచ్చ రచ్చ జరుగుతుండగా ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కూడా స్పందించారు. వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమని మండిపడ్డారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కావాలని.. అలా కాదని రాజకీయ జోక్యం చేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదన్నారు. వ్యక్తిగత సమాచార సేకరణ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వలంటీర్ల సేవలను పరిశీలిస్తామని బాబు మాటిచ్చారు.

Updated Date - 2023-07-17T22:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising