ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Arrest: సీఐడీ డీజీ సంజయ్ వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతల అభ్యంతరం

ABN, First Publish Date - 2023-09-09T11:48:21+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి సీఐడీ డీజీ సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతల అభ్యంతరం తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా అనేక మంది శిక్షణ పొందారని ఒకవైపు చెబుతూ మరోవైపు అవినీతి జరిగిందని చెప్పడం ఏమిటని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. విడుదల చేసింది రూ.371 కోట్లు అయితే, 300 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) అరెస్ట్‌కు సంబంధించి సీఐడీ డీజీ సంజయ్ (CID DG Sanjay) చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతల అభ్యంతరం తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా అనేక మంది శిక్షణ పొందారని ఒకవైపు చెబుతూ మరోవైపు అవినీతి జరిగిందని చెప్పడం ఏమిటని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. విడుదల చేసింది రూ.371 కోట్లు అయితే, 300 కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని నిలదీశారు. పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన నారా లోకే‌శ్‌కు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ పైబర్ నెట్‌తో సంబంధం ఏమిటని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన ప్రేమ చంద్రారెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదని తెలుగు తమ్ముళ్లు అడిగారు. అవినీతి నిరోధక చట్టం చంద్రబాబుకు ఎలా వర్తిస్తుందని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.


సీఐడీ డీజీ ఏమన్నారంటే...

స్కిల్‌ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పేరిట 550 కోట్ల స్కామ్ జరిగిందని.. దీంతో ప్రభుత్వానికి 371 కోట్ల నష్టం వచ్చిందని ఏపీ సీబీడీ డీజీ సంజయ్ పేర్కొన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై సీఐడీ డీజీ సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నకిలీ ఇన్ వాయిస్ ద్వారా సెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తెలిపారు. అలాగే తమ దర్యాప్తులో ప్రధాన నిందితుడు చంద్రబాబునాయుడే అని తేలిందన్నారు. అన్ని లావాదేవవీలు చంద్రబాబుకు తెలిసే జరిగినట్లు చెప్పారు. అలాగే ఈ స్కామ్‌కు సంబంధించి కీలక డాక్యుమెంట్లు మాయం చేశారని ఆరోపించారని తెలిపారు. ఈడీ, జీఎస్‌టీ ఏజెన్సీలు కూడా ఈ స్కాంపై దర్యాప్తు చేశాయన్నారు. అంతేగాక ఈ స్కామ్‌లో ఫైనల్ బెనిఫిషరీ కూడా చంద్రబాబే అని, న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అందుకే చంద్రబాబును కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నిధుల దారి మళ్లింపునకు సంబంధించి చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందన్నారు. 2014 జూలై నాటికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు ముందే డిజైన్ టెక్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సంస్థ బాధ్యతలు గంట సుబ్బారావు అప్పగిస్తూ ఏకంగా నాలుగు పదవులు కట్టబెట్టారని చెప్పారు. లోకేష్ పాత్రతో పాటు ఇతరుల పాత్ర ఎంతవరకు ఉందనే దానిపై విచారణ చేస్తామన్నారు.

Updated Date - 2023-09-09T11:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising