ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఢిల్లీలో ఎంపీ గోరంట్లను నిలదీసిన ఏపీ యూత్ కాంగ్రెస్

ABN, Publish Date - Dec 21 , 2023 | 12:49 PM

Andhrapradesh: ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదంటూ ఎంపీని ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.

న్యూఢిల్లీ: ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదంటూ ఎంపీని ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదంటూ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన మాట ఏమైందని కాంగ్రెస్ నేతలు నిలదీశారు.

దీనిపై ఎంపీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో పోరాటం చేశామని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని వైసీపీ ఎంపీ చెప్పారు. పార్లమెంట్‌లో అనేక సార్లు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశామన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్నామని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.


ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కారాజు రామారావు మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైసీపీ కి బుద్ధి చెప్పాలన్నారు. విభజన హామీలను వైసీపీ నెరవేర్చలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా , విభజన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 21 , 2023 | 12:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising