MLC elections: ఉమ్మడి పశ్చిమలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ABN, First Publish Date - 2023-03-12T21:02:10+05:30
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC elections) ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు
ఏలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC elections) ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ (Polling) ప్రక్రియ నిర్వహించనున్నారు. ఐదో పోలింగ్ కేంద్రాలైన ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం (Jangareddygudem Bhimavaram), నరసాపురం, కొవ్వూరు డివిజన్ కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు. మొత్తం 1105 మంది ఓటర్లు (ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, ఎక్స్ అఫీషియా సభ్యులు) ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆరుగురు అభ్యర్థులు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్నవెంకటేష్ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి తరలించారు. ఈ ప్రక్రియను ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
Updated Date - 2023-03-12T21:02:10+05:30 IST