కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Roja : రోజా భర్తకు అరెస్ట్ వారెంట్

ABN, First Publish Date - 2023-08-29T07:15:31+05:30

ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది...

Minister Roja : రోజా భర్తకు అరెస్ట్ వారెంట్

చెన్నై, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు అద్వే సెల్వమణికి చెన్నై జార్జిటవున్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది. 2016లో దర్శకుడు ఆర్కే సెల్వమణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి ఒక టీవీ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా జార్జిటౌన్ కోర్టులో దావా వేశారు. ఈ కేసు విచారణకు సెల్వమణి, ఆయన తరపు న్యాయవాది గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు సెల్వ మణికి ఆరెస్టు వారెంట్ జారీ చేసింది.

Roja-Selvamani.jpg

Updated Date - 2023-08-29T07:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising