ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gannavaram: గన్నవరంలో వైసీపీ విధ్వంసం.. టీడీపీ కార్యాలయంపై దాడి

ABN, First Publish Date - 2023-02-20T18:13:48+05:30

గన్నవరం (Gannavaram) రాజకీయం గరంగరంగా మారింది. గన్నవరంలో వైసీపీ శ్రేణులు (YCP leaders) విధ్వంసం సృష్టించారు. టీడీపీ (TDP) కార్యాలయంపై దాడి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం: గన్నవరంలో (Gannavaram) వైసీపీ శ్రేణులు (YCP leaders) రెచ్చిపోయాయి. విధ్వంసం సృష్టించాయి. గన్నవరం టీడీపీ (TDP) కార్యాలయంపై వైసీపీ గుండాలు దాడి చేశారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు.

ఈ దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అనుచరులే చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోలీసులు ఉండగానే చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులను అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించడం గమనార్హం. టీడీపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదని టీడీపీ అంటున్నారు. పోలీసులు అలసత్వమే కారణమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్యే వంశీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. దాడిలో 50-60 మంది అల్లరి మూకలు పాల్గొన్నారు. పోలీసుల సాక్షిగా వంశీ అనుచరుల విధ్వంసకాండకు దిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొదట టీడీపీ ఆఫీస్‌ దగ్గర ఎమ్మెల్యే వంశీ రెక్కీ నిర్వహించారని చెబుతున్నారు. వంశీపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. టీడీపీ నేతలు వెళ్లిన వెంటనే కార్యాలయంపై వంశీ అనుచరుల దాడికి దాగారని చెబుతున్నారు. టీడీపీ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో వైసీపీ గూండాల దాడికి దిగారని టీడీపీ నేతలు అంటున్నారు.

Updated Date - 2023-02-20T19:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising