Ayyannapatrudu : గంజాయిలో ఏపీ మొదటి స్థానం ఉందంటున్నాయ్ నివేదికలు.. జగన్ సిగ్గు పడాలి
ABN, First Publish Date - 2023-05-11T11:39:30+05:30
గంజాయిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని.. సీఎం జగన్ సిగ్గు పడాల్సిన విషయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు.
విశాఖ : గంజాయిలో ఏపీ మొదటి స్థానంలో ఉందని నివేదికలు చెబుతున్నాయని.. సీఎం జగన్ సిగ్గు పడాల్సిన విషయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. గంజాయితో యువత నిర్వీర్యం అయిపోతోందన్నారు. పెద్ద ఎత్తున గంజాయి సాగు అవుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసులు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఎంత మంది పై చర్యలు తీసుకున్నారని అయ్యన్న ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసులు తమ పవర్ చూపించి... గంజాయిని నిర్మూలించాలన్నారు. దేశానికి ఆహారాన్ని అందించిన ఏపీ.. ఇపుడు గంజాయి అందించడం దారుణమని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
Updated Date - 2023-05-11T11:39:30+05:30 IST