TDP: టీడీపీ మహిళా నేతకు బెయిల్
ABN, First Publish Date - 2023-04-19T20:47:41+05:30
కృష్ణాజిల్లా గన్నవరం (Gannavaram)లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన గొడవల్లో అరెస్టయిన తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణి
విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం (Gannavaram)లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన గొడవల్లో అరెస్టయిన తెలుగు మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయికల్యాణి (Sai kalyani)కి న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ (Vijayawada)లోని మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. ఈ నెల పదో తేదీన సాయి కల్యాణిని అరెస్టు చేశారు. గన్నవరం పోలీసులు ఆమెను క్రైం నంబర్ 332, 333ల్లో నిందితురాలిగా చేర్చారు. ఈ రెండు కేసుల్లోనూ న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. ఒక్కో కేసులో రూ. 25 వేలు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
గన్నవరం దాడి ఘటనలో ధర్నా చేసిన కేసులో నిందితురాలైన మూల్పూరి సాయికల్యాణి కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హనుమాన్‌జంక్షన్ స్టేషన్‌లో సాయికల్యాణి భర్త సురేంద్రకుమార్, అరుణ్‌కుమార్, ఇంటిలో పనిచేసే మరో వ్యక్తిపై గన్నవరం ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో మహిళా పోలీసులు కె.వాణి, వి.లక్ష్మిల విధులకు ఆటంకం కలిగిస్తూ అసభ్యపదజాలంతో దూషించారని ఫిర్యాదు చేయడంతో హనుమాన్‌జంక్షన్ ఎస్సై వాసా వెంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు.
Updated Date - 2023-04-19T20:47:41+05:30 IST