ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhanu Prakash Reddy : రోజా ఏ విధంగా అవినీతికి పాల్పడిందో డేటా మొత్తం బీజేపీ దగ్గరుంది

ABN, First Publish Date - 2023-11-08T14:31:22+05:30

ఏపీ సీఎం జగన్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా విమర్శలకు టార్గెట్ చేస్తున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. విజయ్ సాయి రెడ్డి, రోజా పురందేశ్వరి పై చేసిన వ్యక్తిగత విమర్శలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.

చిత్తూరు : ఏపీ సీఎం జగన్ కళ్ళల్లో ఆనందం చూసేందుకు ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా విమర్శలకు టార్గెట్ చేస్తున్నారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. విజయ్ సాయి రెడ్డి, రోజా పురందేశ్వరి పై చేసిన వ్యక్తిగత విమర్శలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. పురందేశ్వరి సంధిస్తున్న ప్రశ్నలకు జగన్‌కు, ఆ పార్టీ నేతలకు వెన్నులో వణుకు పుడుతోందన్నారు. భయంతో బ్యాలెన్స్ తప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో మంత్రి రోజా ఏవిధంగా అవినీతికి పాల్పడింది?.. ఎన్ని కోట్లు సంపాదించి ఎక్కడెక్కడ దాచుకున్నారనే డేటా మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి వద్ద, బీజేపీ వద్ద ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ వచ్చే ప్రసక్తే లేదని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.

వచ్చినా గెలిచే పరిస్థితి లేదన్నారు. కచ్చితంగా ప్రభుత్వం మారబోతోందన్నారు. వైసీపీ అవినీతి అంతా కక్కి కక్కించడం ఖాయమన్నారు. దొంగ ఓట్లు కరెన్సీ నోట్లతో గెలవాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశమే లేదన్నారు. నగిరిలో రోజా చేసిన అభివృద్ధిని ప్రశ్నించడానికి రేపు నగరికి బీజేపీ వెళుతోందన్నారు. దమ్ము ధైర్యం ఉంటే అక్కడ అభివృద్ధిపై తేల్చుకుందాం అంటూ రోజాకు భాను ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు.

Updated Date - 2023-11-08T14:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising