ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhuma Akhila Priya: జగన్, ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యేపై భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-04-11T21:17:55+05:30

ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే (Allagadda YCP MLA) బిజేంద్రరెడ్డిపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నంద్యాల: ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే (Allagadda YCP MLA) బిజేంద్రరెడ్డిపై టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి శిలాఫలకలపై పెట్టే దృష్టి పరిపాలన మీద పెట్టి ఉంటే ఆళ్లగడ్డ ఈ పాటికి బాగుపడేదని ఆమె విమర్శించారు. 'వైసీపీ నాయకులు ఇంటింటికి పోయి ఏ మొఖం పెట్టుకొని స్టిక్కర్లు అంటిస్తున్నారని, స్టిక్కర్లు అంటించాల్సింది గోడలమీద కాదు మీ ముఖాలపైన' అని అఖిలప్రియ అన్నారు. సీఎం జగన్ (Jagan) ఆళ్లగడ్డ ప్రాంతానికి వచ్చి రూ. 100 కోట్లు శాంక్షన్ చేసి ఇంత వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు.

ఒక్కొక్క షాపుకు రూ. 3000 వసూలు చేసిన డబ్బులు మున్సిపాలిటీకి చేరలేదని, వైసీపీ నాయకులు వాళ్ల జేబులో వేసుకున్నారని అఖిలప్రియ ఆరోపించారు. పేద ప్రజల నుంచి డబ్బు ఆశించడం వైసీపీ నాయకులకు సిగ్గుగా అనిపించలేదా అని ప్రశ్నించారు. ఎవరైనా పార్టీ మారితే వైసీపీ నాయకులు అహం సహించక వారిని ఎర్రగుడిదిన్నెకు ఎత్తుకు పోయి భయపెడుతున్నారని, ప్రజల్లో వైసీపీపై తిరుగుబాటు ఉందని విమర్శించారు. వైసీపీ నాయకులు రోడ్లమీద కనిపిస్తే రాళ్లు తీసుకొని కొట్టేంత స్థాయిలో ప్రజలు ఉన్నారని అఖిలప్రియ అన్నారు.

ఇటీవల నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి (Nandyala YCP MLA Shilpa RaviChandraKishor Reddy) చూపు టీడీపీ వైపు ఉందంటూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Former Minister Bhuma AkhilaPriya) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే శిల్పా రవి టచ్‌లో ఉన్నారని తనకు తెలిసిందన్నారు. టీడీపీ (TDP)లో చేరేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి (YCP MLA) ఫ్లాట్‌ఫారం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు.

ఈ క్రమంలో నంద్యాల ఎమ్మెల్యే (Nandyala MLA)కు భూమా అఖిలప్రియ మరోసారి సవాల్ విసిరారు. ‘‘ఈనెల 4న ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతా.. నేను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలి. 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకొని వస్తా. నేను అక్రమాలకు పాల్పడ్డానని ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలి. లేకపోతే క్షమాపణలు చెప్పాలి’’ అని సవాల్ విసిరారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లను ఎమ్మెల్యే శిల్పా రవి సతీమణి నాగినిరెడ్డి గొర్రెలు అని దురుసుగా మాట్లాడారని భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-11T21:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising