BJP Leader: సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు సరికావు
ABN, First Publish Date - 2023-09-05T13:03:23+05:30
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు సరికావని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు.
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Tamilnadu Minister Udaynidhi Stalin) వ్యాఖ్యలు సరికావని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ (BJP Leader Madhav) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సనాతన ధర్మంపై ఉదయినిధి స్టాలిన్ వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. సీపీఎం రాజ్యసభ సభ్యుడు వెంకట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని.,. కాంగ్రెస్ నేతలు (Congress leaders) కూడా పాల్గొన్నారని.. కాంగ్రెస్ ఎలా దీనికి మద్దతు తెలుపుతుందని ప్రశ్నించారు. హిందుత్వంపై దాడి ప్రారంభమైందన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌కు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్టాలిన్ అనేక దేవాలయాల్లో సంస్కృతంలో ఎందుకు పూజలు నిర్వహించాలి.. తమిళ భాషలో నిర్వహించాలని వితండ వాదం చేస్తున్నారన్నారు. సనాతన ధర్మంపై మాట్లాడే శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం ఒక కులానికి మతానికి చెందింది కాదన్నారు. హిందుత్వంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. దేశంపై కుట్రపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-09-05T13:03:23+05:30 IST