Bonda Uma : టీటీడీ బోర్డులో ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రారెడ్డికి స్థానం సిగ్గు చేటు
ABN, First Publish Date - 2023-08-26T12:07:30+05:30
టీటీడీనీ కమర్షియల్ చేసేశారని.. కేవలం ఆదాయవనరుగా చూస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బోండా ఉమ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రా రెడ్డికి.. పైరవి కారులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం సిగ్గు చేటని విమర్శించారు. తీహార్ జైలు ముద్దాయిలకు టీటీడీ బోర్డులో స్థానం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు.
అమరావతి : టీటీడీనీ కమర్షియల్ చేసేశారని.. కేవలం ఆదాయవనరుగా చూస్తున్నారని టీటీడీ బోర్డు మాజీ మెంబర్ బోండా ఉమ విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయి శరత్ చంద్రా రెడ్డికి.. పైరవి కారులకు టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం సిగ్గు చేటని విమర్శించారు. తీహార్ జైలు ముద్దాయిలకు టీటీడీ బోర్డులో స్థానం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. నేరస్థులకు అడ్డాగా టీటీడీని వైసీపీ మార్చేసిందని బోండా ఉమ విమర్శించారు.. అలాగే ఇతర మతాలకు అడ్డాగా టీటీడీ మారిపోయిందని విమర్శించారు. టీటీడీ బోర్డు నియామకాలపై హిందూవుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో కి రాగానే టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని బోండా ఉమ తెలిపారు.
Updated Date - 2023-08-26T12:07:30+05:30 IST