Bonda Uma : జగన్ పాలన వచ్చాకే పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయ్..
ABN, First Publish Date - 2023-11-08T12:42:28+05:30
ఎంతోమంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన వచ్చాకే ఏపీలో అనేక పరిశ్రమలు తరలి పోయాయన్నారు.
విజయవాడ : ఎంతోమంది త్యాగాల ఫలితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలన వచ్చాకే ఏపీలో అనేక పరిశ్రమలు తరలి పోయాయన్నారు. వ్యాపార ధోరణితో జగన్ ఆలోచన ఉన్నందున పొస్కో, అదానీ, జిందాల్ రాలేదన్నారు. అమర్ రాజా, లూలూ, కియా, వంటి సంస్థలు జగన్ అవినీతి వల్ల వెళ్లిపోయాయన్నారు. జగన్ అవినీతి విధానాల వల్ల పెట్టుబడిదారులు ఏపీ వైపు కన్నెత్తి చూడటం లేదని బోండా ఉమ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రే చంద్రబాబు హయాంలో ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారన్నారు.
‘‘జగన్ వచ్చాక ఉన్న ఉద్యోగాలు పోయి కార్మికులు వీధిన పడ్డారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం నిర్ణయం కరెక్ట్ కాదు. అక్కడ భూములు కొట్టేయడానికి జగన్, విజయసాయి రెడ్డి కుట్ర చేశారు. కేంద్రం లో కొంతమంది పెద్దలతో జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అని జగన్ చెప్పారు. ఇప్పుడు మోదీ కాళ్ల దగ్గర మోకరిల్లి కేసులు తొలగించాలని కోరుతున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. టీడీపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం కాకుండా కేంద్రం పై ఒత్తిడి తెస్తాం. వెయ్యి రోజుల నుంచి పోరాటం చేస్తున్న కార్మికులకు టీడీపీ మద్దతు ఇస్తుంది’’ అని బోండా ఉమ పేర్కొన్నారు.
Updated Date - 2023-11-08T12:42:33+05:30 IST