ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Buchi Ram Prasad: వైసీపీ అవినీతి ఉండవల్లికి ఎందుకు కనిపించడం లేదు? ఆ ధైర్యం ఉండవల్లికి ఉందా?

ABN, First Publish Date - 2023-09-23T20:37:47+05:30

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై (Undavalli Arun Kumar) టీడీపీ (TDP) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ (Buchi Ram Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై (Undavalli Arun Kumar) టీడీపీ (TDP) రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ (Buchi Ram Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీకి అండగా నిలవాలి.. రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలు కాపాడాలనే ఉండవల్లి స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై హైకోర్టులో పిల్ వేశాడని మండిపడ్డారు.


"స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండానే చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపిన విషయం ఉండవల్లికి తెలియదా?. ఉండవల్లి నిజంగా ప్రజల ఆస్తులకు కాపలా కుక్కే అయితే వాటిని దోచుకుంటున్న దొంగల్ని వదిలేసి, ఆవుల్ని చూసి అరవడం ఏమిటి?. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు.. వైసీపీ ప్రభుత్వ అవినీతి ఉండవల్లికి ఎందుకు కనిపించడం లేదు?. ఉండవల్లి నిజంగా విజిల్ బ్లోయర్ అయితే, వైసీపీ ప్రభుత్వ మద్యం, ఇసుక కుంభకోణాలపై ఎందుకు న్యాయస్థానాలకు వెళ్లడు?. జగన్ సర్కార్ దోపిడీకి సంబంధించిన ఆధారాలు ఇవ్వడానికి టీడీపీ సిద్ధం.. వాటితో కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసే ధైర్యం ఉండవల్లికి ఉందా?. అనేక చిట్ ఫండ్ కంపెనీల అక్రమాలుంటే, కేవలం మార్గదర్శిపైనే ఉండవల్లి న్యాయస్థానాలకు వెళ్లడం తన వ్యక్తిగత కక్షలో భాగం కాదా?." అని బుచ్చిరామ్ ప్రసాద్ ప్రశ్నించారు.

Updated Date - 2023-09-23T20:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising