ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ

ABN, First Publish Date - 2023-02-22T19:44:36+05:30

తెలంగాణ (Telangana), ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింంది. పోలవరం (Polavaram) బ్యాక్‌వాటర్‌పై సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ (Telangana), ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింంది. పోలవరం (Polavaram) బ్యాక్‌వాటర్‌పై సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఢిల్లీలో జనవరి 25న జరిగిన సమావేశంలోని నిర్ణయాలను అమలు చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. పోలవరం బ్యాక్‌వాటర్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలతో కేంద్ర జలశక్తిశాఖ జరుపతలపెట్టిన ముఖ్యమంత్రుల సమావేశం ఇంకా కొలిక్కిరాలేదు. ఈనెల 15వ తేదీన ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్ (CM Jagan) అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంతో ఆ భేటీ వాయిదా పడింది. ఈనెల 28వ తేదీన తదుపరి సమావేశం ఉంటుందని సంకేతాలు వెలువడినా అలాంటి అవకాశం లేదని తెలుస్తోంది. సీఎంల స్థాయిలో సమావేశాలు జరుగనందున ఈ కేసు విచారణను రెండునెలల పాటు వాయిదా వేయాలని కేంద్ర జలశక్తిశాఖ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.

పోలవరం బ్యాక్‌వాటర్‌తో ముంపు ప్రభావం ఉంటుందని 2007లో ఒడిశా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. దీనిలో 2015లో తెలంగాణ ఇంప్లీడ్‌ అయింది. ఆయా రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో గతేడాది సెప్టెంబరు 29వ తేదీన కేంద్ర జలశక్తిశాఖ నాలుగు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం కూడా నిర్వహించింది. ఈ విషయం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్నందునా కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కు బాధ్యతలు అప్పగించగా... సాంకేతిక అంశాలపై రెండుసార్లు సమావేశాలు కూడా జరిగాయి. పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపు ప్రాంతాలను గుర్తించడానికి సంయుక్త సర్వే చేపట్టాలని సీడబ్ల్యూసీ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో సీఎంల స్థాయిలో సమావేశాలు జరగాల్సి ఉండగా... ఏపీ సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం, ఈ అంశంపై చర్చించేందుకు సమయం లేకపోవడంతో సమావేశం వాయిదా పడుతూ వస్తోంది.

Updated Date - 2023-02-22T19:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising