Challa Srilakshmi: జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిపై చల్లా శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు
ABN, First Publish Date - 2023-11-12T17:01:06+05:30
నంద్యాల జిల్లా అవుకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మిని అనంతపురం వైసీపీ జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి టార్గెట్ చేశారు. చల్లా శ్రీలక్ష్మికి చెందిన ఫోటోలు ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు.
శ్రీ సత్యసాయి జిల్లా: నంద్యాల జిల్లా అవుకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మిని అనంతపురం వైసీపీ జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి టార్గెట్ చేశారు. చల్లా శ్రీలక్ష్మికి చెందిన ఫోటోలు ఉన్నాయంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. చల్లా శ్రీలక్ష్మి పర్యటనలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బ్లాక్ మెయిల్ చేశారు. వేర్వేరు నంబర్ల నుంచి వాట్సప్ కాల్ చేసి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి బెదరించారని బాధితురాలు చెబుతున్నారు. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి ఫోన్ నుంచి ఏ తరహాలో బెదిరిస్తున్నారో రాతపూర్వకంగా అవుకు పోలీసులకు జడ్పీటీసీ చల్లా శ్రీలక్ష్మి ఫిర్యాదు చేశారు. చల్లా శ్రీలక్ష్మి ఫిర్యాది మేరకు ఆ ఫోన్ నెంబర్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిదిగా గుర్తించి 354(c), 354D,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ధర్మవరం పట్టణంలో అవుకు ఎస్ఐతో పాటు పోలీసులపై సుధాకర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డికి ధర్మవరంకు చెందిన కీలక ప్రజాప్రతినిధి మద్దతుగా నిలిచారు. ఎలాంటి చర్యలు చేపట్టకూడదంటూ పోలీస్ ఉన్నతాధికారిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని తన సంరక్షణలో కీలక ప్రజా ప్రతినిధి ఉంచుకున్నారు. ధర్మవరం పోలీసులు వ్యవహరించిన తీరుపై కర్నూలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంపై శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి వివరించినట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-11-12T17:16:53+05:30 IST