Chandrababu : చంద్రబాబు ఐఆర్ఆర్ కేసులో బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ABN, First Publish Date - 2023-10-18T13:35:22+05:30
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను నవంబర్ 7కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
అమరావతి : ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంటు మార్పు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణను నవంబర్ 7కు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పారు. తమకు అనుకూలంగా వస్తే ఈ కేసులో కూడా వర్తిస్తుందని న్యాయవాదులు చెప్పారు. విచారణ నవంబర్‌కు వాయిదా వేయాలని న్యాయవాదులు కోరారు. అప్పటివరకు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. కేసు విచారణను హైకోర్టు నవంబర్ 7కు వాయిదా వేసింది.
Updated Date - 2023-10-18T13:54:05+05:30 IST