Chandrababu : నన్ను హత్య చేయాలనే వైసీపీ గూండాలు వచ్చారు
ABN, First Publish Date - 2023-08-09T13:39:34+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు తనపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన హత్య యత్నం చేసి, రివర్స్‌లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతో అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లులో విధ్వంసం జరగబోతుందని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందన్నారు.
విజయనగరం : టీడీపీ అధినేత చంద్రబాబు తనపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన హత్య యత్నం చేసి, రివర్స్‌లో తనపైనే హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతో అంగళ్లలో విధ్వంసం సృష్టించారన్నారు. అంగళ్లులో విధ్వంసం జరగబోతుందని పోలీసులకు ముందస్తు సమాచారం ఉందన్నారు. తనను హత్య చేయాలనే వైసీపీ గూండాలు వచ్చారన్నారు. కమెండోలు పలు సార్లు తన ప్రాణాలు కాపాడారన్నారు. పుంగనూరులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లు మీదకు రావలసిన అవసరమేంటని ప్రశ్నించారు. దాడులపై సీబీఐతో విచారణ జరగాలన్నారు. చిత్తూరు ఎస్పీది అమానుష వైఖరని అన్నారు.
అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు. తనపై చాలా సార్లు హత్యాయత్నం చేయాలని ప్లాన్ చేశారన్నారు. రోడ్డు పైకి ఆ రోజు ఉదయం వైసీపీ వాళ్లు వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చంద్రబాబు వివరించారు. తనపై హత్యాయత్నం జరిగింది కాబట్టి వెంటనే సీబీఐ విచారణ జరగాలన్నారు. తనపై అనేక సార్లు ఈ విధంగా దాడులకు పాలడుతున్నారు కాబట్టి ఎవరూ తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారో సీబీఐ విచారణలో తేలాలన్నారు. తనపై ఎన్ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరగాలని చంద్రబాబు పేర్కొన్నారు. తనపై అనేక సార్లు ఈ విధంగా దాడులకు పాలడుతున్నారు కాబట్టి ఎవరు తనను చంపడానికి ప్లాన్ చేస్తున్నారో సీబీఐ విచారణలో తేలాలన్నారు. తనపై చాలా సార్లు దాడికి యత్నించారన్నారు. తెలుగుదేశం శ్రేణులు రొడ్డెక్కకుండా ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు, అంగళ్లలో వైసీపీ శ్రేణుల్ని ఎందుకు నియంత్రించలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
Updated Date - 2023-08-09T13:39:34+05:30 IST