ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: చంద్రబాబు ఉదారత.. వైసీపీకి చెందిన మహిళా రైతుకు ఆర్థికసాయం

ABN, First Publish Date - 2023-05-04T16:14:45+05:30

అకాల వర్షాలకు రైతులు నిండా మునిగారు. భారీగా పంటలు నష్టపోయి గగ్గోలు పెడుతున్నారు. లక్షలాది ఎకరాల్లో రూ.కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: అకాల వర్షాలకు రైతులు నిండా మునిగారు. భారీగా పంటలు నష్టపోయి గగ్గోలు పెడుతున్నారు. లక్షలాది ఎకరాల్లో రూ.కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి. కల్లాల్లో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. పసుపు, మెరప, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అయినా జగన్‌ సర్కారు (Jagan Govt) కన్నెత్తి చూడడం లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా బాధిత రైతుల్ని పరామర్శించట్లేదు. తక్షణ పరిహారం ఇంతిస్తామనే ప్రకటనా చేయట్లేదు. కనీసం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులైనా క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన దాఖలా లేదు. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో నేనున్నాంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షంతో దెబ్బతిన్న పంటలను రైతులను పరామర్శిస్తున్నారు. చేతికొచ్చిన పంట నోటిదాక వెళ్లకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు ఉదారత చాటుకున్నారు. వైసీపీ (YCP)కి చెందిన మహిళా రైతు ప్రభావతికి ఆర్థికసాయం చేశారు. ప్రభావతికి రూ.2.30 లక్షలు చంద్రబాబు అందజేశారు. ప్రభావతి కుమార్తె కాలేజ్ ఫీజుకుగాను రూ.2.30 లక్షలు సాయం చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు.

రైతుల కన్నీళ్లకు జగన్ కారణం: చంద్రబాబు

రైతుల కన్నీళ్లకు సీఎం జగన్ (CM Jagan) కారణం. రైతుల కష్టాలకు జగన్ జవాబు చెప్పాలి. ఏప్రిల్ మొదటి తేదీన ధాన్యాన్ని సేకరించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఆ ఊసే లేదు. నాలుగేళ్లలో జగన్ పొలంలో దిగాడా?.. ఓ వైపు రైతులు కష్టాల్లో ఉంటే.. భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన అంటున్నారు జగన్. కరోనా వచ్చి అన్ని సంస్థలు మూతపడినా.. రైతులు మాత్రం పొలంలో ఉండి పంటలు పండించారు. అన్నిచోట్ల ఆహార సంక్షోభం వచ్చినా.. మనకు మాత్రం రాకపోవడానికి రైతులే కారణం. అటువంటి రైతులను జగన్ నిండా ముంచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిందని మహిళా రైతుపై కేసుపెట్టారు.

Updated Date - 2023-05-04T16:25:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising