ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrabau: రేపు జైల్లో చంద్రబాబు దీక్ష

ABN, First Publish Date - 2023-10-01T03:10:23+05:30

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు.

తనకు జరిగిన అన్యాయంపై

గాంధీ జయంతి రోజున నిరసన

అదేరోజు భువనేశ్వరి సైతం దీక్షలో

అన్ని నియోజకవర్గాల్లో చేపట్టాలని

పార్టీ శ్రేణులకు అచ్చెన్న పిలుపు

సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో గాంధీ జయంతి రోజున నిరసన దీక్ష చేయనున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరామని, ఆయన అంగీకరించారని తెలిపారు. అదే రోజున ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఒకరోజు దీక్ష చేస్తారని తెలిపారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు.

Updated Date - 2023-10-01T07:20:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising