Chandrababu Naidu: సైకో జగన్ పాలనలో తొలిసారి దండయాత్రలు చూశా..
ABN, Publish Date - Dec 20 , 2023 | 08:11 PM
దేశంలో ఎక్కడా పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని.. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూశానంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయనగరం: దేశంలో ఎక్కడా పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని.. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూశానంటూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద జరిగిన ‘యువగళం- నవశకం’.. సభలో ఆయన మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే..
‘‘దేశంలో ఎక్కడా పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవు. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూశా. పోలీసులను అడ్డంపెట్టుకుని ఇబ్బందులు పెట్టారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటాం. యువగళం జనగళంగా మారి ప్రజాగర్జనకు నాంది పలికింది. ఏపీకి వచ్చిన పరిశ్రమలను తరిమికొట్టారు. యువతకు ఉపాధి అవకాశాలు దొరకని పరిస్థితి ఉంది. యువతకు టీడీపీ- జనసేన అండగా ఉంటాయి. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే బాధ్యత తీసుకుంటాం. మాకు రాజకీయ వ్యతిరేకత తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర పూర్తిగా నలిగిపోతోంది. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ పారిపోయే పరిస్థితి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగింది.. కబ్జాలు పెరిగాయి. వైసీపీ నేతలు మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు’’.
‘‘గతంలో విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండేది. ప్రస్తుతం విశాఖ గంజాయికి రాజధానిగా మారింది. రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లింది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌గా మారాలి. అమరావతిని సర్వనాశనం చేసి మూడు ముక్కలాట ఆడారు. రుషికొండను బోడిగుండుగా మార్చారు. సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తాం. అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహిస్తాం. అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టో ప్రకటిస్తాం. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చేపట్టాం. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటాం. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తాం. అన్నదాత కార్యక్రమం ద్వారా రైతులకు ఆర్థికసాయం. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తాం. అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటాం. కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయం’’.. అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Updated Date - Dec 20 , 2023 | 08:38 PM