Perni nani: చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారంటూ పేర్ని నాని ఫైర్..
ABN, First Publish Date - 2023-08-08T17:10:49+05:30
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu) వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) విమర్శలు గుప్పించారు.
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై (Chandrababu) వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni nani) విమర్శలు గుప్పించారు.
"చంద్రబాబు అధికారంలో లేకపోతే తప్పుడు పెద్దరికం చూపిస్తారు. ఎప్పుడు కుట్రలు కుతంత్రాలే. పోలీసులపై దాడి చేయడానికి చంద్రబాబు దగ్గర రాళ్లు ఎక్కడివి. రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ అయిన సరే పోలీసులపై కుట్రలు, దాడులు చేసిన పార్టీలు ఉన్నాయా.? చంద్రబాబు దుర్మార్గపు కుట్రల వల్ల ఒక కానిస్టేబుల్ కళ్లు పోయాయి. హైదరాబాద్ నగరంలో ఉండి రాష్ట్రంపై దుర్మార్గపు కుట్రలు చేస్తున్నారు." అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-08-08T17:12:49+05:30 IST