Chandrababu: చంద్రబాబు పోరుబాట
ABN, First Publish Date - 2023-05-11T20:11:45+05:30
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పోరుబాట కార్యక్రమానికి విచ్చేయనున్నారు.
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పోరుబాట కార్యక్రమానికి విచ్చేయనున్నారు. చంద్రబాబు పర్యటన ద్వారా రైతులు భరోసా కల్పించనున్నారు. ఆకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను స్వయంగా కలుసుకుని వారి కష్టాలను తెలుసుకుని రైతు భవిష్యత్‌కు అండగా నిలవాలని పర్యటన చేయనున్నారు. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం యంత్రాంగం కనీసం పట్టించుకున్న సందర్భాలు లేవు. చంద్రబాబు దువ్వ పర్యటన తర్వాత రైతుకు అవసరమైన గోనె సంచులు, ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా రైతులకు మరింత భరోసా ఇవ్వాలని పోరుబాట ద్వారా 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, మధ్యలో రైతులతో మాట్లాడి వారి పడుతున్న ఇబ్బందులు, ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకుంటారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు చేశారు.
గురువారం సాయంత్రం ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి తణుకు మండలం దువ్వ, తణుకు మీదుగా ఇరగవరం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు పోరుబాట పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఇరగవరం రైస్‌మిల్ వద్ద అల్పాహారం అనంతరం గోటేరు రోడ్, కె.ఇల్లింద్రపర్రు రోడ్ వరకు పాదయాత్ర సాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకన్య పిల్లింగ్ స్టేషన్ ఇరగవరం రోడ్ వద్ద భోజన విరామం అనంతరం ఇరగవరం కాలనీ మీదుగా తణుకు మున్సిపల్ కార్యాలయం, నరేంద్ర సెంటర్ మీదుగా సాయంత్రం ఐదు గంటలకు ప్లై ఓవరు మీదుగా తేతలి వై.జంక్షన్ చేరుకుని, బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Updated Date - 2023-05-11T20:11:57+05:30 IST