ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chelluboina Venugopala Krishna : జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు

ABN, First Publish Date - 2023-11-20T13:32:05+05:30

ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. కుల గణన -2023 పై ప్రాంతీయ సదస్సుకు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులు హాజరయ్యారు.

విజయవాడ : ఏపీలో కులగణన అనే చారిత్రక ఘట్టానికి సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. కుల గణన -2023 పై ప్రాంతీయ సదస్సుకు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. దేశమంతా జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలను ఫాలోఅవుతోందన్నారు.

గతంలో మంజునాధన్ కమిషన్ ఫెయిలైందన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి శాశ్వత బీసీ కమిషన్ ను వేశారన్నారు. బీహార్ లో కులగణనకు రాజకీయ కోణం ఉందని చెల్లుబోయిన అన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసం కాదన్నారు. సామాజిక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమన్నారు. అన్ని సామాజిక వర్గాల పై జగన్ మోహన్ రెడ్డికి ఎంతో గౌరవం ఉందన్నారు. గతంలో ఉద్యమాలు చేసినా, కులగణన ప్రక్రియలో ఫలితాలు రాలేదని చెల్లుబోయిన పేర్కొన్నారు.

Updated Date - 2023-11-20T13:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising