Chandrababu: రణరంగంగా మారిన అంగళ్లు.. రాళ్ల దాడికి పాల్పడ్డ వైసీపీ శ్రేణులు.. తీవ్రస్థాయిలో హెచ్చరించిన టీడీపీ అధినేత
ABN, First Publish Date - 2023-08-04T16:49:00+05:30
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు రణరంగంగా మారింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. కురబలకోటలో చంద్రబాబు మీటింగ్‌కు వెళ్తున్న టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పోలీసులు పక్కనే ఉన్నా రాళ్ల దాడిని నిలువరించలేకపోయారు. అటు బస్టాండ్ వద్ద టీడీపీ నేతపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డాయి.
కురబలకోట: అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు రణరంగంగా మారింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. కురబలకోటలో చంద్రబాబు మీటింగ్‌కు వెళ్తున్న టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పోలీసులు పక్కనే ఉన్నా రాళ్ల దాడిని నిలువరించలేకపోయారు. అటు బస్టాండ్ వద్ద టీడీపీ నేతపై వైసీపీ గూండాలు దాడులకు తెగబడ్డాయి. చంద్రబాబు పర్యటనకు వెళుతున్న టీడీపీ కార్యకర్త వద్ద నుంచి జెండాలు లాక్కున్నారు. విచక్షణారహితంగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వైసీపీ గూండాల నుంచి టీడీపీ కార్యకర్తను కాపాడారు. ఈ ఉద్రిక్త పరిస్థితులతో అంగళ్లు రణరంగంగా మారిపోయింది. యుద్ధవాతావరణం నెలకొంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసన, రాస్తారోకో చేపట్టారు. చంద్రబాబు అంగళ్లుకు వచ్చే సమయానికి వైసీపీ కార్యకర్తలు మరింత రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ బ్యానర్లను తొలగించారు. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు.
తీవ్రంగా హెచ్చరించిన చంద్రబాబు...
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా హెచ్చరించారు. పుంగనూరుకు వెళ్తున్నా.. అక్కడ పుడింగి బాబు మాట్లాడారు. వైసీపీ (YCP) శ్రేణుల రాళ్ల దాడిలో గాయపడిన టీడీపీ (TDP) కార్యకర్తలకు చికిత్స చేయించాలని టీడీపీ నేతలకు సూచించారు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. ‘పులివెందులకే వెళ్లాను.. ఇక్కడికి రాకూడదా?’ అంటూ ప్రశ్నించారు. తానూ చిత్తూరు జిల్లాలోనే పుట్టానన్నారు. టీడీపీ కార్యాకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డారు. తాను బాంబులకే భయపడలేదని.. రాళ్లకు భయపడతానా? అని అన్నారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు (YCP Leaders) రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేయడంతో ఎన్ఎస్‌జీ (NSG) బలగాలు చంద్రబాబుకు రక్షణగా నిలబడ్డాయి. వైసీపీ దాడులకు తెగ బడిందంటూ టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుకు గాయాలు చూపించారు. మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) పతనం అంగళ్లు నుంచే ప్రారంభమైందని, పెద్దిరెడ్డి ఈరోజు నుంచి రోజులు లెక్కపెట్టుకో అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు.
Updated Date - 2023-08-04T17:36:38+05:30 IST