ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: బీఎస్ఎన్ఎల్ జీఎంకు చంద్రబాబు లేఖ

ABN, First Publish Date - 2023-02-10T19:47:40+05:30

బీఎస్ఎన్ఎల్ జీఎంకు (BSNL GM) టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababunaidu) లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: బీఎస్ఎన్ఎల్ జీఎంకు (BSNL GM) టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababunaidu) లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో బీఎస్ఎన్ఎల్ సేవలు మెరుగుపరచాలని జీఎంకు రాసిన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. మారుమూల ప్రాంతమైనందున ఇబ్బందులు వస్తున్నాయని బీఎస్ఎన్ఎల్ జీఎంకు చంద్రబాబు తెలిపారు. వందల గ్రామాల్లో టెలికాం సేవలకు అంతరాయం వస్తోందని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీఎస్ఎన్ఎల్ జీఎంకు చంద్రబాబు లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాలకూ అందుబాటులో ఉండేలా బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తరించాలని చంద్రబాబు కోరారు.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టంలో లేని అధికారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. జగన్(YS Jagan) చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. చట్టానికి వ్యతిరేకంగా జగన్ పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని చంద్రబాబు(Chandrababu) గుర్తు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు. ప్రధాని మోదీ(PM Modi) వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని.. అమరావతికి అండగా ఉంటానని ప్రధాని చెప్పారని గుర్తుచేశారు. అమరావతిపై జగన్ మాట మార్చారని ధ్వజమెత్తారు. నాడు అసెంబ్లీ సాక్షిగా జగన్ ఏం చెప్పారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉందని.. అయినా 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ వేసిందని చంద్రబాబు అన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించిందని చెప్పారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని తెలిపిందని అన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపిందని చంద్రాబబు చెప్పారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. రాజధానిగా అమరావతిని మెజార్టీ ప్రజలు ఆమోదించారని చంద్రబాబు గుర్తు చేశారు.

Updated Date - 2023-02-10T19:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising