Jagan Tour: పరీక్షల కన్నా జగన్ సభే ముఖ్యమట!.. చెప్పాపెట్టకుండా నగరికి విద్యార్థుల తరలింపు.. తల్లిదండ్రుల ఆగ్రహం
ABN, First Publish Date - 2023-08-28T09:43:16+05:30
ముఖ్యమంత్రి జగన్ సభ కోసం నగరిలో ట్రాఫిక్ ఆంక్షలతో పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మరోవైపు సభకు విద్యార్థులను తరలించేందుకు ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. సీఎం జగన్ సభకు విద్యార్థిని విద్యార్థులను తరలించడానికి ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలను కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమంగా రద్దు చేశాయి.
తిరుపతి: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan Reddy) సభ కోసం నగరిలో ట్రాఫిక్ ఆంక్షలతో పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మరోవైపు సభకు విద్యార్థులను తరలించేందుకు ఏకంగా పరీక్షలనే రద్దు చేశారు. సీఎం జగన్ సభకు విద్యార్థిని విద్యార్థులను తరలించడానికి ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలను (Engineering Semester Examinations) కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమంగా రద్దు చేశాయి. ఈరోజు (సోమవారం) ఇంజనీరింగ్‌లో సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే పరీక్షల కోసం విద్యార్థిని విద్యార్థులను కాలేజీకి తీసుకువెళ్లే బస్సులను విద్యార్థిని విద్యార్థులకు చెప్పకుండానే కాలేజీ యాజమాన్యం రూటు మార్చేసింది. నగరిలో జగన్ సభ కోసం తిరుపతి నుంచి తరలించారు. సెమిస్టర్ పరీక్షల సమయంలో రాజకీయ సభలకు తీసుకపోతే తమ పిల్లల భవిష్యత్తు ఏం కావాలని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కాలేజీల తీరుపై కొందరు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదేంటని ప్రశ్నించిన వారిని వారికి ఆరోగ్యం సరిలేదంటూ మిగతా విద్యార్థులకు చెప్పి వారిని బస్సు నిర్వాహకులు బస్ నుంచి దింపేశారు. బస్సులోనే ఫుడ్ పాకెట్స్ కూడా ఇచ్చే విధంగా కాలేజీలు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకున్నాయి. దీంతో విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు కాకుండా జగన్ సభకు తీసుకుపోతామని ముందస్తుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
Updated Date - 2023-08-28T09:43:16+05:30 IST