Kuthuhalamma: మాజీ మంత్రి కుతూహలమ్మ కన్నుమూత
ABN, First Publish Date - 2023-02-15T10:17:00+05:30
మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ(74) కన్నుమూశారు.
చిత్తూరు: మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ(74) (Former TDP Minister Gummadi Kuthuhalamma) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కుతూహలమ్మ (Kuthuhalamma) బుధవారం ఉదయం తిరుపతి నగరంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1949 జూన్ 1న ప్రకాశం జిల్లా (Prakasam District) కందుకూరులో జన్మించారు. ఎంబీబీఎస్ చేసి డాక్టర్‌గా సేవలందించారు. గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు. 1980 - 85 మధ్య చిత్తూరు జడ్పీ చైర్‌పర్సన్ (Chittoor ZP Chairperson)గా విధులు నిర్వహించారు. 1985లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1991 - 93 మధ్యలో ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి (Minister of Health and Women and Child Welfare)గా కుతూహలమ్మ పనిచేశారు. 1999 - 2003 మధ్య అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలి (Member of the Public Accounts Committee in the Assembly) గా సేవలందించారు. 2007 - 2009 మధ్య అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker of the Assembly)గా కుతూహలమ్మ సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో కీలక బాధ్యతలు నిర్వహించిన కుతూహలమ్మ 2014లో రాష్ట్ర విభజన (Division of State) తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ (TDP) అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. కుతూహలమ్మ మృతి పట్ల టీడీపీ, కాంగ్రెస్ నేతలు (TDP, Congress Leaders), కార్యకర్తలు సంతాపం ప్రకటించారు.
Updated Date - 2023-02-15T10:39:17+05:30 IST