Nara Lokesh : గిట్టు బాటు ధర కల్పిస్తాం అన్న జగన్ రెడ్డి ఎక్కడ?
ABN, First Publish Date - 2023-01-28T13:29:40+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కడపల్లిలో పొలంలో పని చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, ముని రత్నంని నారా లోకేష్ కలిశారు.
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పంలో రెండో రోజు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కడపల్లిలో పొలంలో పని చేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ, ముని రత్నంని నారా లోకేష్ కలిశారు. మొక్క జొన్న, టొమాటో పంటలు వేసి నష్ట పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెరిగిపోతోందని.. పండిన పంటకు కనీస ధర రాక ఇబ్బంది పడుతున్నామన్నారు. అర ఎకరంలో వ్యవసాయం చేస్తున్నామంటూ వ్యవసాయంలో ఉన్న కష్టాలు లోకేష్‌కి రైతులు వివరించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. రూ. 3 వేల కోట్ల తో ప్రత్యేక నిధి పెట్టి గిట్టు బాటు ధర కల్పిస్తాం అన్న జగన్ రెడ్డి ఎక్కడని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతుకి సాయం అందడం లేదన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని ప్రశ్నించారు. రైతుల మెడలో మీటర్లు ఉరి తాళ్ళు కాబోతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాల వలన రైతులు క్రాప్ హాలిడే ఇచ్చే దుస్థితి వచ్చిందని నారా లోకేష్ పేర్కొన్నారు.
గుడుపల్లె మండలం బెగ్గిపల్లె గ్రామస్తులతో లోకేష్ మాట్లాడారు. తమ సమస్యలను ఆయనకు కురబ కులస్థులు విన్నవించారు. తమ కులస్థులు అణిచివేతకు గురవుతున్నారని కురబ నేతలు వెల్లడించారు. చంద్రబాబుపై కక్షతో బీసీలను జగన్‌రెడ్డి వేధిస్తున్నారన్నారు. టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్నారనే బీసీలపై కక్ష సాధిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. జగన్ వచ్చాక బీసీలు 10 శాతం రిజర్వేషన్లు కోల్పోయారన్నారు.
అనంతరం గణేష్‌పురం క్రాస్‌లో స్థానిక రైతులతో మాట్లాడారు. నిత్యావసరాల ధరలు పెరిగి బతుకు భారం అవుతుందని మహిళల ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్లకు మీటర్లు బలవంతంగా పెడుతున్నారని గణేష్‌పురం క్రాస్‌లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులు జీవనం కొనసాగించే పరిస్థితి ఏపీలో లేదన్నారు. మీటర్ల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందని నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక అన్యాయం చేస్తోందన్నారు. జగన్‌రెడ్డి చెప్పేదొకటి.. చేసేదొకటిగా ఉందన్నారు . కేసులకు భయపడేది లేదని నారా లోకేష్ పేర్కొన్నారు
Updated Date - 2023-01-28T15:03:41+05:30 IST