కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tirumala: ఆపరేషన్ చిరుత అట్టర్ ఫ్లాప్.. మరో రెండు చిరుతల కలకలం

ABN, First Publish Date - 2023-09-07T16:52:29+05:30

తిరుమలలో తాజాగా మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు టీటీడీ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. స్పెషల్ టైప్ కాటేజీల వద్ద ఒక చిరుత, నరసింహస్వామి ఆలయం వద్ద మరొక చిరుత సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గమనించినట్లు తెలిపారు. వాటిని బంధించేందుకు ఏర్పాటు చేశామన్నారు.

 Tirumala: ఆపరేషన్ చిరుత అట్టర్ ఫ్లాప్.. మరో రెండు చిరుతల కలకలం

దేశవ్యాప్తంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ కలియుగ దైవం వెంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తుంటారు. అయితే ఆధ్యాత్మిక ప్రదేశం తిరుమలలో చిరుతల కలకలం కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ చిరుత పేరుతో గత రెండు నెలల కాలంలో ఇప్పటివరకు ఐదు చిరుతలను పట్టుకున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. అయితే తాజాగా మరో రెండు చిరుతలను గుర్తించినట్లు గురువారం మధ్యాహ్నం టీటీడీ ప్రకటించింది. దీంతో తిరుమలకు వెళ్లే భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నడకదారిలో వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. అసలు తిరుమల కొండల్లో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.

తిరుమలలో తాజాగా మరో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు టీటీడీ అధికారులు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. స్పెషల్ టైప్ కాటేజీల వద్ద ఒక చిరుత, నరసింహస్వామి ఆలయం వద్ద మరొక చిరుత సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గమనించినట్లు తెలిపారు. వాటిని బంధించేందుకు ఏర్పాటు చేశామన్నారు. నాలుగు రోజుల క్రితం ఒక చిరుత సంచరిస్తుందని ప్రకటించిన అధికారులు.. ఆ చిరుతను ఈరోజు ఉదయం బంధించినట్లు వెల్లడించారు. నరసింహస్వామి ఆలయం ఏడో మైలురాయి దగ్గర ట్రాప్‌లో ఈ చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు తాజాగా మరో రెండు చిరుతలు సంచరిస్తున్నాయని ప్రకటించడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. తిరుమల వెళ్లే భక్తులకు రక్షణ లేదని.. టీటీడీ చేపట్టిన ఆపరేషన్ చిరుత అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: AP Politics: విద్యార్థులకు గురువులు అవసరం లేదా? అందుకేనా టీచర్లకు జీతాలు ఆపేసింది..?


కాగా కొన్నిరోజుల క్రితం అలిపిరి నడకమార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన ఆరేళ్ల బాలిక లక్షిత మృతిచెందింది. ఈ ఘటనతో టీటీడీపై విమర్శల వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. టీటీడీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చిరుతను చేపట్టారు. అలిపిరి-తిరుమల నడకదారి మార్గంలో పలు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల సంచారాన్ని గమనిస్తున్నారు. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. ఇలా ఇప్పటివరకు మొత్తం ఐదు చిరుతలను బంధించారు. కానీ ఇంకా చిరుతలు సంచరిస్తున్నాయని అధికారులు గుర్తించడంతో అసలు ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తమ రక్షణ కోసం కంటితుడుపు చర్యగా టీటీడీ అధికారులు కర్రలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేతిలో కర్రలు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు.

Updated Date - 2023-09-07T16:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising